Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Oct-2017 12:28:04
facebook Twitter Googleplus
Photo

మునుపెన్నడూ చూడని విజువల్ వండర్ ను ప్రేక్షకులకు చూపించేందుకు డైరెక్టర్ శంకర్ రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ తీసిన రోబో అన్ని భాషల్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు రోబోకు సీక్వెల్ గా తీస్తున్న 2.0 సినిమా ఇప్పుడు భారత దేశంలోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా పేరుతెచ్చుకుంది. దీనికితోడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి సౌత్ మూవీలో.. అదీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

రోబో సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈనెల 27న దుబాయ్ లో జరగనుంది. ఈ ఫంక్షన్ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిండానికి 2.0 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రెడీ అవుతోంది. ఈ ఫంక్షన్ నిర్వహణకే దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే 2.0 ఆడియో రిలీజ్ కోసం చేస్తున్న ఖర్చుతో ఓ మీడియం బడ్జెట్ సినిమా తీసేయొచ్చు. కానీ లైకా వాళ్లు మాత్రం ఏ కోశానా వెనక్కు తగ్గకూడదన్నట్టుగానే ముందుకెళ్తున్నారు. దీనికితోడు ఇదే స్జేజ్ పై ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండటం ఈ ఫంక్షన్ ను స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.

ఓ రకంగా ఈ ఫంక్షన్ సినిమా చరిత్రలో నిలిచిపోవడమే కాదు.. 2.0పై ప్రేక్షకుల్లో ఉండే బజ్ ను డబుల్ చేస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. నవంబరులో హైదరాబాద్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి మూవీ టీజర్ ను విడుదల చేయనున్నారు.

,  ,  ,  ,  ,  ,