Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 11:15:14
facebook Twitter Googleplus
Photo

ఆర్పీ పట్నాయక్ వృత్తి పరంగా మ్యూజిక్ డైరెక్టర్ అయినా.. యాక్టింగ్.. డైరెక్టింగ్ కూడా చేసేస్తూ ఉంటాడు. రీసెంట్ గా మనలో ఒకడు అనే మూవీతో మెప్పించేందుకు ప్రయత్నించగా.. బాగుందనే టాక్ వచ్చినా.. మూవీకి కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆర్పీ.. మహేష్ విషయంలో తాను పెద్ద తప్పు చేసేశానని అంటున్నాడు. తాను లైఫ్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే అన్నది ఆయన వెర్షన్.

ఇంతకీ ఆర్పీ చేసిన తప్పు.. నిజం మూవీ విషయంలో జరిగిందట. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి.. సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్.. ఒకటి రెండు మినహాయిస్తే.. దాదాపు అన్ని పాటలను తనే పాడేశాడు. "నిజం సినిమాకు నేను పాడడం చాలా పెద్ద తప్పు. నేను సంగీతం ఇస్తే అన్నీ పాడేయాలని అనుకోను కానీ.. అప్పటి పరిస్థితులు అందుకు కారణం అయ్యాయి. ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమా వచ్చినపుడు నా వాయిస్ మహేష్ బాబుకు అస్సలు సూట్ కాలేదని ఫీలవుతూ ఉంటాను" అని చెప్పాడు ఆర్పీ పట్నాయక్.

"మహేష్ ఒక సూపర్ హీరో.. నా వాయిస్ కు వయసు తక్కువ. ఆయన స్థాయికి తగినట్లుగా అస్సలు కుదర్లేదు. అందుకే నిజం మూవీకి నేను పాడటం నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. అది తప్పు అని ఒప్పుకునేందుకు కూడా సిగ్గు పడను" అంటూ తన ఫీలింగ్స్ పంచుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో కం డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్.

,  ,  ,  ,