Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2015 12:21:55
facebook Twitter Googleplus
Photo

'రుద్రమదేవి' వీర విహారం ఒక మహోన్నతమైన చరిత్ర .. ఆ చరిత్రకు అందమైన దృశ్య రూపాన్ని ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్. ఆయన రూపొందించిన 'రుద్రమదేవి' తెలుగులో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. తెలుగులో విడుదల చేస్తున్న రోజునే తమిళ్లోను ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకువెళుతున్నట్టు చెప్పారు. అనుష్క ఒక జీవితకాలం పాటు చెప్పుకునేదిగా రుద్రమదేవి నిలుస్తుందనే విషయం ఆమె గెటప్ చూస్తేనే తెలిసిపోతోంది.

చరిత్రను .. అందునా యుద్ధవాతావరణంతో కూడిన చరిత్రను తెరకెక్కించడం అంత ఆషామాషీ విషయం కాదు. ఆనాటి సామాజిక పరిస్థితులు .. వేషధారణ .. సెట్టింగులు ..ఇలా అవేక విషయాలను పరిశీలించవలసి వుంటుంది. ఈ విషయంలో ఎంతో కృషిచేసిన గుణశేఖర్, తానే నిర్మాతగా మారి 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,