Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2015 11:10:55
facebook Twitter Googleplus
Photo

అనుష్క ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'రుద్రమదేవి' చిత్రం విడుదలపై వున్న సందిగ్ధత వీడింది. ఈ చిత్రాన్ని అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ గత నాలుగు రోజులుగా మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఆయన ముహూర్తాన్ని పెట్టించుకున్నారు. ఇక ఈ భారీ చిత్రం పలు విశేషాలు సంతరించుకుంది. ఇండియాలో రూపొందిన మొట్టమొదటి చారిత్రాత్మక త్రీడీ సినిమాగా ఇది చరిత్రకు ఎక్కుతోంది. ఇందులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా ఓ కీలక పాత్ర పోషించాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన వీరనారి రుద్రమదేవి కథను వెండితెరపై ఆవిష్కరించాలన్న తన రంగులకలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు గుణశేఖర్ సాకారం చేసుకున్నాడు.

,  ,  ,  ,  ,