Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 11:50:22
facebook Twitter Googleplus
Photo

సైరా నరసింహారెడ్డి సినిమాను అఫీషియల్ గా ప్రకటించేశారు మెగాస్టార్ చిరంజీవి. తన పుట్టినరోజు నాడు ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా లాంచ్ చేసి.. సినిమాకు పనిచేయనున్న ప్రపంచస్థాయి టెక్నీషియన్ల పేర్లను కూడా చెప్పేశారు. అయితే వీరిపై రోజుకో రూమర్ వస్తోంది. అసలు అవన్నీ మెగా నిజాలా మెగా రూమర్లా అనే క్లారిటీ మాత్రం ప్రొడ్యూసర్ రామ్ చరణ్ సైడ్ నుండి ఏమాత్రం రాకపోయినా కూడా.. రూమర్లు మాత్రం కొత్తకొత్తగా పుట్టుకొస్తూనే ఉంటున్నాయి.

మొన్నటికిమొన్న ఈ సినిమా నుండి ఏ.ఆర్.రెహ్మాన్ తప్పుకున్నాడు అన్నారు. ఏదో చిన్న డిస్కషన్ వలన వీరికి చెడిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పెద్దగా కిక్కివ్వలేదంటూ కొందరు కామెంట్ చేశారు. అవతల విజయ్ అదిరింది వంటి రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటున్న రెహ్మాన్ కు సైరా సినిమా కిక్కివ్వలేదంటే వినడానికే కామెడీగా ఉంది. అలాగే రెహ్మాన్ ప్లేసులోకి తమన్ వస్తున్నాడు అని చెప్పడం ఇంకా కామెడీగా ఉంది. మొత్తానికి ఇది నిజమా రూమరా అనే క్లారిటీ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ వారే ఇవ్వాల్సి ఉంది.

ఇకపోతే కెమెరామాన్ రవివర్మన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడని.. రంగస్థలం 1985 షూటింగ్ పూర్తవ్వగానే.. ఆల్రెడీ మెగాస్టార్ 150వ సినిమాను చిత్రీకరించిన రత్నవేలు ఆ స్థానంలోకి రానున్నానడని మరో రూమర్ వచ్చింది. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. ముఖ్యంగా సినిమా అనుకున్నట్లు అక్టోబర్ 20న మొదలవ్వకపోతే ఈ మార్పులన్నీ జరుగుతాయని రూమర్ రాయుళ్ళు చెబుతున్నారు. దీనిపై కూడా మెగా టీమ్ మాత్రం సైలెంటుగానే ఉండడం గమనార్హం.

మరో ప్రక్కన దర్శకుడు సురేందర్ రెడ్డి మొన్నటివరకు లండన్ వెళ్ళి అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీతో సంప్రదింపులు జరిపి వచ్చాడు. ఇప్పటికే సైరా కోసం హైదరాబాదులో కొన్ని సెట్టింగులు నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,  ,