Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2017 10:13:57
facebook Twitter Googleplus
Photo

ప్రేక్షకులు ఊహించిందే నిజమైంది. అజ్ఞాతవాసి అని అందరి మదిలో ఫిక్స్ అవ్వడంతో దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్ట్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి మీరు అనుకున్న లుక్ అని చెప్పకనే చెప్పాడు. మొత్తానికి లుక్ తో దర్శకుడు అందరిని ఆకర్షించాడు. సినిమాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పవర్ స్టార్ ఏం చేస్తాడా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా కథపై కూడా ఇప్పుడు మళ్లీ రూమర్స్ అందుకున్నాయి. కథ ఎలా ఉంటుందా అని ఇప్పుడు అందరు ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా టైటిల్ కింది ఉన్న క్యాప్షన్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనేది క్యాప్షన్. దీని అర్ధం ఏమిటా అని నెట్ లో సెర్చ్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు. అసలైతే దీని అర్ధం వెలివేయబడ్డ రాకుమారుడు అని ఓ అర్ధం వస్తోంది. అలా ఆలోచిస్తే పవన్ ఎన్నారైల హక్కుల కోసం అమెరికాలో పోరాటం చేయనున్నాడని ఓ టాక్ ఉంది. ఇక బాషా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో కూడా సినిమా కథ ఉంటుందని కూడా ఓ వర్గం వారు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనే పేరుతో ఒక నవల కూడా ఉంది హెచ్ జే. బ్రాడ్లి అనే రచయిత రాసిన ఆ బుక్ లో రాజులు - యుద్ధాలు అనే అంశాలపై పై ఉంటుంది.

మరి దాన్ని బేస్ చేసుకొని త్రివిక్రమ్ కథ రాశాడా అంటే.. అజ్ఞాతవాసి లో పవన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపిస్తున్నాడు. ఒకవేళ ఆ కంటెంట్ ని ఫాలో అయ్యి ఉండవచ్చు కదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా కథ ఎలా ఉన్నా త్రివిక్రమ్ స్టైల్ లో ఉంటుంది అనేది మాత్రం నిజమని చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,