Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 16:43:05
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమాపై చాలానే రూమర్స్ వచ్చేస్తున్నాయి. స్పైడర్ తో లింక్ ఉన్నా లేకపోయినా.. ఈ సినిమా రిజల్ట్ ను బేస్ చేసుకుని.. తన కొత్త సినిమాల విషయంలో మహేష్ కేర్ ఎక్కువ తీసుకోవాలని భావిస్తున్నాడని.. అందుకే కొంతమేర షూటింగ్ జరిగినా సరే.. భరత్ అను నేను షూటింగ్ అర్ధాంతరంగా నిలిపేశాడనే రూమర్స్ గుప్పుమన్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన భారీ అసెంబ్లీ సెట్ ను పూర్తి డిస్మాండిల్ చేయడమే ఈ రూమర్స్ మొదలు కావడానికి కారణంగా చెబుతున్నారు. అయితే.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమా ఆగిపోయే ప్రసక్తే లేదని.. భారీ బడ్జెట్ తో నిర్మించ తలపెట్టిన భరత్ అను నేను మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చేస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆ సెట్ లో షూటింగ్ పూర్తయిపోవడంతో.. మరో ప్రాంతంలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అటు దర్శకులు.. ఇటు నిర్మాతల విషయంలో మహేష్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడని.. భారీ ఇమేజ్.. కోట్లాది రూపాయల ఖర్చు విషయంలో అత్యధిక కేర్ తీసుకుంటాడని చెబుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భరత్ అను నేను చిత్రం ఆగిపోయే సమస్యే లేదని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,