Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2017 10:41:33
facebook Twitter Googleplus
Photo

ఖైదీ నెం 150 ఇచ్చిన కిక్కుతో తన 151వ సినిమాపై ఫోకస్ పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆల్రెడీ ఈ కంబ్యాక్ సినిమాకు 100 కోట్లు షేర్ వచ్చే సూచనలు కనిపించడంతో.. ఇప్పుడిక 151వ సినిమా కంటెంట్ పై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చాలా అద్భుతంగా వండిస్తున్నారట. ఇదే సమయంలో హీరో రామ్ చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్ పై తాను ప్రొడ్యూస్ చేసే రెండో సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నాడట.

మెగాస్టార్ 151వ సినిమాను కూడా చరణే ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి.. మనోడు ఇప్పటినుండే హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నాడట. ఒక ప్రక్కన 1850వ కాలం నాటి లుక్స్ లో ఇమిడిపోతూ.. మరో ప్రక్కన పాటల్లో కాస్త విలేజి టైపు గ్లామర్ ఒలకబోయాలంటే.. చరణ్ ముందు చిరంజీవి కోసం ఆప్షన్లు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఈ విషయంలో ఎక్కువమంది అనుష్క అయితేనే కరక్ట్ అంటూ చెప్పడంతో.. చరణ్ కూడా అనుష్క డేట్ల కోసం ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నాడని టాక్.

నిజానికి 150వ సినిమాలోనే అనుష్క ను తీసుకుందాం అనుకున్నప్పట్టకీ.. ఆ సమయంలో ఆమె బాహుబలి 2 షూటింగ్ లో ఉండటంతో.. ఖైదీ నెం 150 మిస్సయ్యింది. మరి ఇప్పుడు అనుష్క ఈ ప్రాజెక్టులోకి దూకుతుందో లేది తెలియాలంటే.. కాస్త ఆగాల్సిందే!!

,  ,  ,  ,  ,