Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 12:40:58
facebook Twitter Googleplus
Photo

అఆ సినిమాకు సంబంధించి బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కే ఇవ్వాలి. ఆ తర్వాతి స్థానం హీరో నితిన్ ది. ఐతే ఈ ఇద్దరికీ ఇప్పటిదాకా పైసా ఇవ్వలేదని అంటున్నాడు నిర్మాత రాధాకృష్ణ. త్రివిక్రమ్ వరుసగా మీ బేనర్లోనే సినిమాలు చేయడానికి డబ్బు వ్యవహారాలే కారణమా అని అడిగితే రాధాకృష్ణ ఈ సంగతి వెల్లడించాడు.

??మా రిలేషన్ విషయంలో జనాలకు తప్పుడు అభిప్రాయాలున్నాయి. మా ఇద్దరికీ వేవ్ లెంగ్త్ కలవడం వల్లే వరుసగా సినిమాలు చేస్తున్నాం. అంతే తప్ప నేనేదో ఎక్కువ పారితోషకం ఇచ్చి త్రివిక్రమ్ తో సినిమాలు చేయించుకుంటున్నానని అనుకోవడం సరికాదు. నిజానికి నేనింకా ?అఆ? సినిమాకు త్రివిక్రమ్ - నితిన్ లకు రెమ్యూనరేషనే ఇవ్వలేదు?? అన్నాడు రాధాకృష్ణ. త్రివిక్రమ్ ఇంతకుముందు ఇద్దరు నిర్మాతలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడని.. అందుకే తనతో కంఫర్టబుల్ గా ఉండటంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడని రాధాకృష్ణ చెప్పాడు.

అఆ సినిమాను 40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించామని.. ఇది నితిన్ మార్కెట్ కు రెట్టింపు అని.. ఎక్కడా రాజీ పడకుండా ఓ పెద్ద సినిమా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించామని రాధాకృష్ణ అన్నాడు. అఆకు అద్భుతమైన స్పందన వస్తోందని.. ఫుల్ రన్లో రూ.50 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని తన అంచనా అని చెప్పాడు. తన తర్వాతి సినిమా కూడా త్రివిక్రమ్ తోనే ఉంటుందని రాధాకృష్ణ మరోసారి స్పష్టం చేశాడు.

,  ,  ,  ,  ,  ,