మెగాస్టార్ చిరంజీవ నటించిన ఖైదీ నంబర్ 150.. ఈ నెల 11న థియేటర్లలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని ప్రతీ అంశం.. మూవీకి సంబంధించిన ప్రతీ అప్ డేట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగించేస్తోంది. ముఖ్యంగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే లిరికల్ సాంగ్ కు అయితే.. ఏకంగా కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఓ తెలుగు ఆడియో సాంగ్.. ఇంత షార్ట్ టైమ్ లో ఈ ఫీట్ సాధించడం అరుదైన రికార్డ్.
అయితే.. ఈ పాటలో కుమ్ముడు అనే పదం వాడడంపై చాలానే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఎంత ప్రాస కోసం అయితే మాత్రం.. మరీ ఇలా కుమ్ముడు అనే పదం వాడడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు తాజాగా చిరంజీవి స్వయంగా సమాధానం ఇచ్చారు. 'ప్రస్తుతం మనం కుమ్ముడు అనే పదం చాలా కామన్ గా ఉపయోగించేస్తున్నాం. ఎక్కువగా తినే వాళ్లను చూసి బాగా కుమ్ముతున్నాడురా' అంటాం. అంత క్యాచీగా ఈ వర్డ్ మారిపోయింది. పాడుకోవడానికి వీలుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కుమ్ముడు ఉపయోగించాం' అంటూ వివరణ ఇచ్చారు చిరంజీవి.
కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివన్నీ కామన్ అన్న చిరు.. తన ప్రాధాన్యత మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కే కాబట్టి.. కుమ్ముడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు.