Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 10:50:59
facebook Twitter Googleplus
Photo

ప్రేమమ్ చిత్రం సక్సెస్ ను ఇంకా ఆశ్వాదిస్తూనే... మరో సినిమాను అక్కినేని అభిమానుల ముందుంచబోతున్నాడు నాగచైతన్య. చాలా కాలంగా విడుదలకు రెడీగా వున్న ?సాహసం శ్వాసగా సాగిపో? చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రం సెన్సార్ గురువారం కంప్లీట్ అయింది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ కట్టబెట్టారు.

నాగచైతన్య మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇటీవలే ఈ చిత్రం ప్రమోషన్ స్టార్ట్ చేసింది చిత్ర బృందం. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావే తర్వాత నాగచైతన్య గౌతమ్మీనన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను నవంబర్ 11న వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో ఈ చిత్రం ప్రణీత మీడియా ద్వారా విడుదలవుతుంది.

మొదటి భాగం ఘర్షణ... ద్వితీయ భాగం ఏ మాయ చేశావెలా వుంటుందని దర్శకుడు చెబుతున్నాడు. అంటే.. ఈ సినిమాలో నాగచైతన్య లవర్ అండ్ మాస్ హీరోగా కనిపించబోతున్నాడని దర్శకుడు ఇటీవల జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పాడు. మరి ఆ విషయం తెలియాలంటే.. మరోవారం ఆగాల్సిందే.

,  ,  ,  ,  ,