Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2016 12:47:02
facebook Twitter Googleplus
Photo

ఏ మాయ చేసావే? సినిమాతో మ్యాజిక్ చేసిన హీరో నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్ మీనన్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే ఆ సినిమాకు ఏ స్థాయి అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ?సాగసం శ్వాసగా సాగిపో? అనే టైటిల్ పెట్టి, ?ఏ మాయ చేసావే? ఫీల్‌ను తలపించేలా టీజర్, పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎప్పట్నుంచో ఎదురుచూస్తూ వస్తున్నారు.
ఇక ?ఎళ్ళిపోమాకే? అనే పాట సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియో కోసం కూడా అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ?సాహసం శ్వాసగా? టీమ్ ఆడియో, సినిమా రిలీజ్ డేట్‌లను ప్రకటించేసింది. ఏ.ఆర్.రహమాన్ అందించిన ఆడియో జూన్ 17న విడుదల కానుండగా, సినిమా జూలై 15న విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు. రెండు భాషల్లోనూ మంజిమా మోహన్ హీరోయిన్‌గా నటించారు.

,  ,  ,  ,  ,