Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2017 13:24:02
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 మూవీ కోసం నాలుగేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన ప్రభాస్ ఎట్టకేలకు కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. రన్ రాజా ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో అంటూ సినిమా ప్రారంభించగా.. ఇప్పటికే దీని టీజర్ ను కూడా విడుదల చేశారు. గురువారం సాయంత్రమే యూట్యూబ్ లోకి వచ్చిన ఈ టీజర్.. బాహుబలి2 మూవీతో పాటు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.

అయితే.. ఈ టీజర్ లో ఓ అమ్మాయిని కూడా చూపించినట్లుగా కనిపిస్తుంది కానీ.. ఎవరనే విషయం తెలీకుండా సీన్ ను పూర్తి చేశారు. నిజానికి అసలీ మూవీలో హీరోయిన్ నే ఇంకా ఎంపిక చేయలేదు. తెలుగుతో పాటు.. తమిళ్.. హిందీల్లో కూడా సాహోను రిలీజ్ చేయాలనే ఆలోచన ఉండడంతో.. బాలీవుడ్ భామను ప్రభాస్ పక్కన నటింపచేసేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. పరిణీతి చోప్రా.. శ్రద్ధా కపూర్.. కత్రినా కైఫ్ లను ఇప్పటికే అడిగారట కూడా. సాహో చిత్రంలో నటించేందుకు వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు కానీ.. ఓ సమస్య వచ్చి పడింది.

తెలుగు.. తమిళ్ వెర్షన్స్ లో హీరోయిన్ గా కనిపించేందుకు అభ్యంతరం లేదంటున్నారట ఈ బాలీ భామలు. కానీ హిందీ వెర్షన్ విషయంలో మాత్రం కుదరని అనేస్తున్నారట. ఎంత క్రేజ్ సంపాదించుకున్నా.. బాలీవుడ్ లో ప్రభాస్ ఇంకా స్వయంగా అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకే ఇలాంటి అభ్యంతరాలు చెబుతున్నారట

,  ,  ,  ,  ,  ,