Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Feb-2015 11:18:26
facebook Twitter Googleplus
Photo

స్వీటీ అనుష్క ఓ అరుదైన ఘనతను పొందుతోంది. ఒక సినిమా మూడు భాగాలలోనూ కథానాయికగా నటించిన క్రెడిట్ కొడుతోంది. తమిళంలో సూర్యా హీరోగా వచ్చిన 'సింగం', 'సింగం 2' చిత్రాలలో ఈ ముద్దుగుమ్మ నాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఆ రెండూ కూడా మంచి సక్సెస్ సాధించాయి. దీంతో ఇప్పుడు 'సింగం 3'కి దర్శకుడు హరి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో సూర్యా మళ్లీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తుండగా, ఆయన సరసన కథానాయికగా మళ్లీ అనుష్కను ఎంచుకున్నట్టు కోలీవుడ్ సమాచారం. ఇప్పటికే 'రుద్రమదేవి', 'బాహుబలి' సినిమాలు పూర్తవడంతో ఈ తమిళ చిత్రానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట!

,  ,  ,  ,  ,