Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2017 13:25:25
facebook Twitter Googleplus
Photo

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న కొత్త సినిమా సాహో టీజర్ ను బాహుబలి: ది కంక్లూజన్ సినిమాతో కలిపి ప్రదర్శించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల కిందట ఈ విషయాన్ని ధ్రువీకరించిన యువి క్రియేషన్స్ అప్పట్నుంచి సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ కూడా నడుపుతోంది. కానీ ఈలోపే ఈ టీజర్ లీకైపోయింది. సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. సాధ్యమైనంత వరకు నెట్లో ఈ టీజర్ లీక్డ్ వీడియోను డిలీట్ చేయించే ప్రయత్నం చేసిన యువి క్రియేషన్స్.. ఇక లాభం లేదని అఫీషియల్ టీజర్ ను కొంచెం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ‘బాహుబలి-2’ విడుదలకు ఒక రోజు ముందే ఈ టీజర్ లాంచ్ కాబోతోంది.

గురువారం సాయంత్రం 5 గంటలకే అఫీషియల్ గా యూట్యూబ్ ద్వారా ‘సాహో’ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ముందు యూట్యూబ్ లో సందడి చేశాక.. ఆ తర్వాత బాహుబలి థియేటర్లను హోరెత్తించనుంది సాహో టీజర్. నిజానికి బాహుబలి-2 షోలు ఈ రోజు రాత్రి 9 గంటలకే మొదలవనున్న నేపథ్యంలో సాహో టీజర్ ఈ రోజే వచ్చేస్తున్నట్లే లెక్క. ఐతే దానికంటే నాలుగు గంటల ముందే యూట్యూబ్ లో టీజర్ చూసుకునే అవకాశం కల్పించబోతున్నారు. ఒకేసారి తెలుగు.. తమిళం.. హిందీ టీజర్లను రిలీజ్ చేయబోతున్నారు

,  ,  ,  ,  ,  ,