Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 12:58:19
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ?సరైనోడు? సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా మొదటిరోజు వచ్చిన టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ వెళుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమా ఓవరాల్‌గా 8 కోట్ల మేర షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా. తెలుగు సినిమా చరిత్రకు ఓ ప్రత్యేక సినిమాగా నిలిచిన ?బాహుబలి? తర్వాత ఈ ప్రాంతంలో ఈ స్థాయి వసూళ్ళు సాధించిన సినిమాగా ?సరైనోడు? నిలవనుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.
అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసే ఆలోచనతో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు బీ, సీ సెంటర్స్‌లో విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సమ్మర్ సీజన్లో ఇతర పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా సరైనోడికి బాగా కలిసివచ్చింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌కు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే 100కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్‌లు హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,