Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2016 16:58:52
facebook Twitter Googleplus
Photo

బయట నందమూరి అభిమానులు.. మెగా ఫ్యాన్స్ ఓ కొట్టేసుకుంటారు కానీ.. అక్కడ హీరోలు మాత్రం బాగానే ఉంటారు. ఆ మధ్య ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి ఓ వేడుకలో ఎంత సందడి చేశారో గుర్తుండే ఉంటుంది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు.. జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టిన రోజు విషెస్ చెప్పడంతో పాటు అతడి కొత్త సినిమా ?జనతా గ్యారేజ్? ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సూపర్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషం.

మొన్నే ?ఒక మనసు? ఆడియో వేడుకలో అభిమానుల మధ్య జరుగుతున్న యుద్ధాల మీద స్పీచ్ ఇచ్చి.. ఇలాంటివన్నీ కూడదని హితవు పలికిన అల్లు అర్జున్.. తారక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేశాడు. ??హ్యాపీ బర్త్ డే తారక్. ఈ రోజు సంతోషంగా గడవాలి. ఈ సంవత్సరమంతా నీకు బాగుంటుంది. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ సూపర్బ్?? అని బన్నీ ట్వీట్ పెట్టాడు.

మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సైతం ఎన్టీఆర్ ను విష్ చేశాడు. ?జనతా గ్యారేజ్? ఫస్ట్ లుక్ పోస్టర్లకు కాంప్లిమెంట్ ఇస్తూ.. ఎన్టీఆర్ ను విష్ చేశాడు. ??ఈ పోస్టర్లో ఏదో ఎనర్జీ కనిపిస్తోంది. ఆ ఎనర్జీ ఎన్టీఆరే.. హ్యాపీ బర్త్ డే తారక్?? అని అతను ట్వీట్ చేశాడు. హీరోల మధ్య ఈ దూరం తగ్గిపోతే.. ఆటోమేటిగ్గా అభిమానుల్లోనూ మార్పు వస్తుంది. కాబట్టి బన్నీ.. సాయిధరమ్ మంచి పనే చేశారని చెప్పాలి. ఈ స్పిరిట్ మిగతా హీరోల్లోనూ వస్తే బాగుంటుంది.

,  ,  ,  ,  ,  ,  ,