Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2017 13:44:18
facebook Twitter Googleplus
Photo

పెద్ద సినిమాల ఆడియో వేడుకల్ని శిల్ప కళా వేదిక లాంటి పెద్ద ఆడిటోరియాల్లో నిర్వహిస్తుంటారు. అక్కడ వేడుకలు జరిగితే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. బ్యాచులు బ్యాచులుగా దిగిపోయి తమ అభిమాన కథానాయకుడిగా మద్దతుగా చాలా హంగామా చేస్తుంటారు. ఇందులో ఒక ప్రణాళిక ప్రకారం హీరో గురించి నినాదాలు చేస్తూ.. హంగామా చేసే అభిమానులు కొందరుంటారు. వీళ్ల వెనుక పీఆర్వోలుంటారు. అభిమాన సంఘాల నాయకులుంటారు. వాళ్లు చేసే హడావుడి వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది.

ఐతే చిన్న-మీడియం రేంజి సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకల్ని స్టార్ హోటళ్లలో చిన్న బాల్ రూమ్స్ లో చేస్తుంటారు. అక్కడ అభిమానుల సందడి పెద్దగా కనిపించదు. అలాంటి చోట్ల ఈ ఫ్యాన్స్ వచ్చి హంగామా చేస్తే అంత బాగుండదు కూడా. కానీ నిన్న నక్షత్రం ఆడియో వేడుకను చిన్న ఆడిటోరియంలో చేయగా.. అక్కడ సాయిధరమ్ ఫ్యాన్స్ పేరుతో కొందరు చేసిన హంగామా టూమచ్ అనిపించింది. సుప్రీమ్ హీరో అని ప్లకార్డ్స్ పట్టుకుని నిలబడ్డ ఫ్యాన్స్.. అతడి మద్దతుగా అదే పనిగా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. వేదికెక్కి ఎవరు మైక్ అందుకున్నా తేజు గురించి నినాదాలు చేస్తూ అంతరాయం కలిగించారు. ఓ దశలో వీళ్ల హడావుడి ఎంత దాకా వెళ్లిందంటే.. సందీప్ కిషన్ మాట్లాడే వంతు వచ్చినపుడు అతడి గురించి తాను రెండు ముక్కలు చెబుతానంటూ కృష్ణవంశీ మైక్ అందుకున్నాడు.

కానీ తేజు ఫ్యాన్స్ రచ్చ ఆ సమయంలో పీక్స్ కు చేరింది. వేదిక మీదున్న వాళ్ల మాటలు అర్థం కాని స్థాయిలో అరుపులు కేకలతో ఇబ్బంది పెట్టారు. దీంతో తాను మాట్లాడలేనంటూ కృష్ణవంశీ మైక్ సందీప్ కు ఇచ్చేశాడు. అంతకంటే ముందు ఇదంతా తేజు కావాలనే చేయిస్తున్నాడేమో అంటూ సరదాగా సెటైర్ వేయడం గమనార్హం. ఆ తర్వాత సందీప్ మైక్ అందుకుని.. లేక లేక ఆయన నా గురించి ఏదో మాట్లాడతానంటున్నారు.. అలాంటి దర్శకుడు కెమెరాల ముందు మాట్లాడితే దాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా కదా.. కొంచెం సైలెంటుగా ఉండండని వేడుకున్నా ఫలితం లేకపోయింది. తిరిగి మైక్ కృష్ణవంశీకి ఇవ్వబోయినా ఆయన తీసుకోలేదు.

,  ,  ,  ,  ,  ,