Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2017 14:13:56
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 టాలీవుడ్ సత్తాను చాటింది. ప్రపంచవ్యాప్తంగా.. దేశవ్యాప్తంగా వసూళ్లను పక్కన పెట్టి.. కేవలం తెలుగు రాష్ట్రాల వసూళ్లను మాత్రమే పరిశీలించినా.. భారీ కలెక్షన్స్ ను సాధించింది బాహుబలి2. భారీ బడ్జెట్ తో రూపొంది బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న మూవీస్ కు 3 రెట్ల వసూళ్లను బాహుబలి2 వసూలు చేసింది. దీని తర్వాత రాబోయే భారీ చిత్రాలకు ఏరియాల వారీగా రేట్లు పెరిగిపోవడానికి బాహుబలి2 కారణమైందని చెప్పచ్చు.

మొదట పోకిరి.. ఆ తర్వాత మగధీర.. అత్తారింటికి దారేది.. శ్రీమంతుడు.. బ్లాక్ బస్టర్స్ తర్వాత ఏరియాల వారీగా రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు సెట్స్ పై ఉన్న పలు చిత్రాలకు.. గత మార్కెట్ ను మించి డిమాండ్ చేయడానికి కారణం.. బాహుబలి2 వసూళ్లే. పవన్- త్రివిక్రమ్ మూవీ.. మహేష్ బాబు స్పైడర్.. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం.. రామ్ చరణ్-సుకుమార్ మూవీలకు నిర్మాతలు దాదాపు అన్ని ఏరియాలలోనూ భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తాలు ఆయా హీరోల కెరీర్ బెస్ట్ కంటే ఎక్కువ కావడం గమనించాల్సిన విషయం. ఆయా హీరోల చిత్రాలకు నిర్మాతలు కోట్ చేస్తున్న మొత్తాలు ఇలా ఉన్నాయి.

పవన్-త్రివిక్రమ్ మూవీకి నైజాంకు 32 కోట్లు.. సీడెడ్ 16నుంచి 18 కోట్లు.. ఆంధ్రా 45కోట్లు కోట్ చేస్తున్నారు. స్పైడర్ నైజాం రైట్స్ కు 25 కోట్లు.. సీడెడ్ 12కోట్లు.. ఆంధ్రా 36 కోట్లు అడుగుతున్నారు. డీజేను నైజాంలో దిల్ రాజ్ సొంతగా విడుదల చేస్తుండగా.. సీడెడ్ కు 12 కోట్లు.. ఆంధ్రాకు 30 కోట్లు కోట్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,