Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2016 11:15:14
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు సాయి ధరమ్ తేజ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక ప్రక్కన ''విన్నర్'' సినిమా ఫస్ట్ లుక్ తో మొన్న తన పుట్టినరోజు నాడు అలరించాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆ సినిమాను పక్కనెట్టి.. కృష్ణవంశీ సినిమాలో తాను చేస్తున్న ఆ ప్రత్యేక పాత్ర మీద పడ్డాడు. ''నక్షత్రం''తో తనలోకి కొత్త యాంగిల్ ఆవిష్కరిస్తా అంటున్నాడు మెగా మేనల్లుడు.

రామ్ చరణ్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ను బట్టి చూస్తుంటే ''నక్షత్రం'' సినిమాలో ఒక రఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాడు. అలెగ్జాండర్ అనే ఆ పోలీస్ పాత్రలో సాయిధరమ్ చాలా రఫ్ అండ్ క్రూడ్ గా కనిపిస్తాడట. సముద్రం సినిమాలో ఒక ప్రకాష్ రాజ్ లా.. ఒక శ్రీహరిలా ఇరగదీస్తాడట. ఇతనికి జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పటివరకు కేవలం కామెడీగా రెండు సినిమాల్లో పోలీస్ డ్రస్సులో మెరిశాడు సాయిధరమ్. ఇప్పుడు సీరియస్ కాప్ రోల్ అంటే.. మరి ఎలా ఉంటుందో చూడాలి.

అయితే మరో విషయం ఏంటంటే.. అసలు నక్షత్రం సినిమాలో హీరో హీరోయిన్లు సందీప్ కిషన్ అండ్ రెజీనా అయితే.. ఇప్పుడు సాయిధరమ్ వారిని డామినేట్ చేస్తున్నట్లు అనిపించట్లేదు? వెయిట్ అండ్ సి.

,  ,  ,  ,  ,  ,  ,