Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Apr-2016 12:29:55
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు.. ఈ మధ్య బాగా డల్ అయిపోయాడు. ఆయన బేనర్ స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. గత ఏడాది సుబ్రమణ్యం ఫర్ సేల్.. కేరింత సినిమాలు ఓ మోస్తరుగా ఆడగా.. ఈ ఏడాది ?కృష్ణాష్టమి? పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో మాంచి హిట్టిచ్చి తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. ఆయన ఆశలన్నీ ?సుప్రీమ్? మీదే ఉన్నాయిప్పుడు. ఏప్రిల్ 1నే విడుదలవుతుందని అనుకున్న ఈ సినిమా.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఇంకో వారం పది రోజుల్లో ?సుప్రీమ్? పనంతా పూర్తయిపోతుందని సమాచారం.

?సుప్రీమ్? ఆడియో వేడుకతో పాటు విడుదలకు కూడా ముహూర్తాలు ఖరారు చేసేశాడట దిల్ రాజు. ఈ నెల 14న ?సుప్రీమ్? ఆడియో వేడుక చేయబోతున్నట్లు సమాచారం. సినిమాను మే 6న విడుదల చేయాలని ఫిక్సయ్యాడు రాజు. ఐతే ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్-నితిన్-సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ?అ..ఆ? రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా నెల రోజుల ముందే రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఐతే ఈ నెల 22న సరైనోడు.. మే 14న ?బ్రహ్మోత్సవం? రిలీజవుతున్న నేపథ్యంలో పోటీ ఉన్నా సరే.. మే 6నే ?సుప్రీమ్? రిలీజ్ చేయడం బెటరని ఫిక్సయ్యాడట రాజు. మే చివరి వారంలో రజినీకాంత్ సినిమా ?కబాలి? రిలీజవ్వబోతుండటం కూడా రాజు ఫస్ట్ వీక్ రిలీజ్ ఖాయం చేయడానికి ఓ కారణమట. ఐతే మంచి క్రేజ్ మధ్య రిలీజవుతున్న ?అ..ఆ?కు పోటీగా వెళ్లడమంటే సాహసమే.

,  ,  ,  ,  ,  ,  ,