Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 12:18:20
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది వేలంటైన్స్ డేకి బెస్ట్ టాలీవుడ్ కపుల్ గా అక్కినేని నాగచైతన్య సమంత పేర్లే ఎక్కువగా వినిపించాయి. అయితే.. సహజంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేసే ఈ జంట. సరిగ్గా ఫిబ్రవరి 14న మాత్రం ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. ప్రేమికుల రోజును ప్రత్యేకంగా ప్రైవేటుగా జరుపుకున్న ఈ జోడీ.. ఆ తర్వాతి రోజుకు కానీ అసలు సంగతి చెప్పలేదు.

తాము ఎంతటి సన్నిహితులమో చెప్పేలా.. సమంత ఇప్పుడు ఓ ఫోటో ట్వీట్ చేసింది. తన ప్రేమికుడు కం వుడ్ బీ అయిన నాగచైతన్యను మనసారా దగ్గరకు తీసుకుని.. నుదుటిపై ముద్దు పెట్టుకున్న ఓ అపూర్వమైన చిత్రాన్ని అభిమానులకు అందించింది సమంత. తన ప్రియురాలి మనసును ఏంటో అర్ధం చేసుకుంటున్నట్లుగా చైతు ఇచ్చిన పోజ్ కూడా బాగుంది.

వేలంటైన్స్ డే రోజున.. ఇంత కంటే బెస్ట్ గిఫ్ట్ వేరే ఏదైనా ఉంటుందా అంటే చెప్పడం కష్టమే కదూ. కొన్నేళ్ల పాటు తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించిన ఈ జంట.. రెండు వారాల క్రితం నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం ఒక్కటే బ్యాలెన్స్ కాగా... త్వరలో ఆ ప్రకటన కూడా వచ్చేయనుంది.

,  ,  ,  ,  ,  ,  ,