Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2017 14:51:07
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎన్టీఆర్ - జై లవకుశ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ తన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించాడు. కానీ ఈ సినిమా వాటన్నిటిని తలదన్నే లా ఉందని ట్రైలర్ లోనే దర్శకుడు చెప్పేశాడు.

ఇప్పటి వరకు మూడు విభిన్న పాత్రలను ఒక్కొక్కటిగా చూపించిన చిత్ర యూనిట్ రీసెంట్ గా ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసి అందులో మూడు పాత్రలను ఒకే ఫ్రేమ్ లో చూపించింది. స్టైల్ - యాక్షన్ -కామెడీ వంటి పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాలో కనిపించనుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ యాంగ్రీ రోల్ జై చెప్పే నత్తి డైలాగ్ అందరికి నచ్చింది. ఈ ట్రైలర్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఎన్టీఆర్ ట్రైలర్ చాలా బావుందనే విధంగా తన స్టైల్ లో ట్వీట్ చేశాడు.

చ.. చ.. చ... చంపేశావ్ తారక్ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. ప్రస్తుత తారలు స్పందిస్తున్న తీరును చూస్తుంటే వారికి కూడా జై క్యారెక్టర్ ఎక్కువగా నచ్చినట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,