Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2017 10:30:00
facebook Twitter Googleplus
Photo

పాత జ్ఞాపకాలను నెమరు వేసేసుకుంటున్నారు సెలబ్రిటీలు. థ్రోబ్యాక్ థర్స్ డేస్ కాన్సెప్ట్ ఇప్పుడు శరవేగంగా పెరుగుతోంది. ఎప్పటివో ఫోటోలను ఎక్కడెక్కడి నుంచో వెతుక్కొచ్చి మరీ పోస్ట్ చేస్తూ.. సెలబ్రిటీలు ఆకట్టుకుంటున్నారు. తమకు తెలియని అలనాటి సంగతులను తెలుసుకుని అభిమానులు కూడా తెగ ఉత్సాహపడిపోతున్నారు.

సుప్రీం హీరో అని మెగా ఫ్యాన్స్ తో ముద్దుగా పిలిపించుకుంటున్న సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో మహా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ఈ కుర్రాడు తన సినిమాల గురించే కాదు.. ఎవరి మూవీస్ గురించి అయినా పోస్టులు పెట్టేయగల సమర్ధుడు. ఇప్పుడు థ్రోబ్యాక్ థర్స్ డేస్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ మెగా హీరో పెట్టిన పోస్ట్ వైరల్ అయిపోయింది. తేజు పోస్ట్ చేసిన ఫోటోలో.. మెగాస్టార్ చిరంజీవి ఒళ్లో ఓ చిన్న బుజ్జాయి కూర్చుని ఉంటాడు. అయితే.. చిరు లుక్ చూడగానే ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఫోటో అనే సంగతి అర్ధమైపోతుంది.

అయితే.. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అంటూ పజిల్స్ లాంటివి పెట్టకుండా.. మెగాస్టార్ ఒళ్లో ఉన్నది తానే అని చెప్పకనే చెప్పాడు తేజు. జీవితంతో పాటు చేసే పని పట్ల ఎంతో నిబద్ధత చూపించాలంటూ.. నాకు స్ఫూర్తి అందించి ప్రేరణగా నిలిచిన చిరంజీవి గారు అంటూ తన స్టైల్ లో మామయ్యపై మళ్లీ ప్రేమ కురిపించేశాడు సాయిధరం తేజ్.

,  ,  ,  ,