Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2017 10:45:52
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ కొత్త సినిమా జవాన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలి క్లాప్ కొట్టించి మరీ ఈ మూవీని స్టార్ట్ చేశారు. బీవీఎస్ రవి దర్శకత్వంతో తెరకెక్కనున్న ఈ మూవీలో మెహ్రీన్ కౌర్ పీర్జాడా హీరోయిన్ గా చేస్తుంది. అయితే.. జవాన్ టైటిల్ వినగానే.. హీరో ఓ సైనికుడి పాత్ర పోషిస్తాడని అనుకోవడం సహజం.

అందుకు తగ్గట్లుగానే తేజు ఓ సోల్జర్ గా కనిపించనున్నాడంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ మూవీలో తేజు చేస్తున్నది ఆర్మీ సోల్జర్ పాతర్ కాదని తేలిపోయింది. జవాన్ చిత్రంలో దేశాన్ని ప్రేమించే ఓ కుర్రాడి పాత్రలో సాయిధరం తేజ్ కనిపించనున్నాడు. దేశభక్తుడి పాత్ర అంతే. దేశం.. కుటుంబాల మధ్య ఏది ఎంచుకోవాలనే సందిగ్ధత ఏర్పడ్డపుడు.. దేశాన్ని ఎంచుకునే ధీరత్వం ఉన్న రోల్ ని తేజు చేస్తున్నాడు' అని చెప్పాడు దర్శకుడు బీవీఎస్ రవి.

సోల్జర్ పాత్రలో నటిస్తున్నాడని వచ్చిన వార్తలన్నీ రూమర్స్ అని కొట్టిపారేసిన దర్శకుడు.. టైటిల్ కి తగ్గట్లుగానే సినిమా ఉంటుందని.. మెగా మేనల్లుడు చేసే పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పాడు. తమిళ్ యాక్టర్ ప్రసన్న ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండగా.. రెగ్యులర్ విలన్స్ తరహాలో ఈ రోల్ ఉండదని.. ప్రతినాయకుడి పాత్రను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,