Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 10:49:29
facebook Twitter Googleplus
Photo

హీరో ప్రభాస్ ఇప్పుడు అందరి ఫెవరెట్ హీరో అయిపోయాడు. ముఖ్యంగా చాలా మంది సెలబ్రెటీలు ప్రభాస్ ని కలవడానికి ఇష్టపడుతున్నారు. అందులో రాజాకీయ నాయకులు - జాతీయ క్రీడాకారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆయనను పలువురు ప్రముఖులు కలుసుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా మరొక అంతర్జాతీయ క్రీడాకారిణి ప్రభాస్ ని కలిశారు.

ఇండియన్ ప్రొఫెషినల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన ఫెవరెట్ హీరో ప్రభాస్ ని కలిసి ఎంతో ఆనందపడింది. ప్రభాస్ షూటింగ్ లో ఉండగా ఒక బ్రేక్ లో ఆయనతో కలిసి ఒక ఫోటో కూడా దిగింది. తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని తన ఫెవరెట్ హీరో అని ఇదివరకే సైనా చాలా సార్లు చెప్పింది. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే హీరోలలో ప్రభాస్ కూడా ఒకరని చెప్పాలి. ఇక బాహుబలి తర్వాత ఆ సంఖ్య బాగానే పెరిగింది. ప్రస్తుత ప్రభాస్ - సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సాహో సినిమా తెలుగు - హిందీలో ఒకేసారి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అయితే ప్రభాస్ తో సాహో సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న శ్రద్దా కపూర్.. సైనా నెహ్వాల్ పై రూపొందుతున్న బయోపిక్ లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఆమె ఈ మధ్యన సైనా ఫ్యామిలీతో బాగా టైమ్ గడిపింది.

,  ,  ,  ,