Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 09:45:04
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ సంచలనం రేపిన సంగంతి తెలిసిందే. ఈ చిత్రం కనీ వినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా విడుదలై థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కూడా దాని ట్రైలర్కు అనూహ్య స్పందన రావడం విశేషం. తాజాగా బాహుబలి: ది కంక్లూజన్ ట్రైలర్ కు 150 మిలియన్ వ్యూస్ రావడం ఓ సరికొత్త రికార్డు.

విడుదలైన అన్ని భాషల్లో కలిపి బాహుబలి: ది కంక్లూజన్ ట్రైలర్ కు 15 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా ట్రైలర్ కూడా కనీసం 5 కోట్ల మైలురాయిని కూడా అందుకోలేదు. ఈ రికార్డును సమీప భవిష్యత్తులో ఏ ఇండియన్ సినిమా కూడా బద్దలుకొట్టే అవకాశం లేనట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. మరే ఇండియన్ సినిమా కూడా ఇంకొన్నేళ్ల పాటు ఆ స్థాయి వసూళ్లను రాబట్టడం కష్టమే.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1800 కోట్లు వసూలు చేసింది. అయితే దంగల్ చిత్రం వసూళ్లలో బాహుబలి-2తో పోటీపడుతోంది. వరల్డ్ వైడ్ వసూళ్లలో దంగల్ రూ.2 వేల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

అయితే చైనా సహా మరిన్ని దేశాల్లో బాహుబలి-2 విడుదల కావాల్సి ఉంది. కాబట్టి దంగల్ రికార్డును కూడా బాహుబలి-2 దాటేసే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,