Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2015 16:57:19
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లో ఖాన్ ల హవా ఎలాంటిదో మనకు తెలుసు. వారి మధ్య పోటీ వైరం కూడా అంతే స్థాయిలో ఉంటాయి. కానీ ఒకోసారి భలే షాక్ ఇస్తుంటారు ఈ ఖాన్ లు. రీసెంట్ గా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన 50వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ రోజున షారూక్ ఇంటికి ఓ స్పెషల్ గెస్ట్ పిలవకుండానే వచ్చేశాడు. ఆయనే కండల వీరుడు సల్మాన్ ఖాన్. షారూక్ ఇంటికొచ్చిన సల్లూభాయ్.. బోలెడు కబుర్లు చెప్పాడు. జోకులు వేశాడు.. అంతేనా షారూక్ కి కొన్ని మూవ్స్ కూడా నేర్పించాడు.

సుల్తాన్ కోసం భాయ్ నాకు మూవ్స్ నేర్పించాడు అంటూ షారూక్ ట్వీట్ చేసి తమ ఇద్దరూ కలిసి కుస్తీపట్లు పడుతున్న ఫోటోను జత చేశాడు. ఇద్దరు ఖాన్ లు కలిసున్న ఈ ఫోటో సెన్సేషన్ సృష్టించడమే కాదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కూడా. ప్రస్తుతం బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్.. సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఈయనో కుస్తీ వీరుడి కేరక్టర్ పోషిస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రెజ్లింగ్ టెక్నిక్స్ షారూక్ ఖాన్ కూడా నేర్పించాడన్న మాట. అందుకే ఈ రకంగా ట్వీట్ చేశాడు బాద్ షా. ప్రస్తుతం షారూక్ నటిస్తున్న రాయీస్.. వచ్చే ఏడాది రంజాన్ పండుగకు రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం తన సినిమా సుల్తాన్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు సల్మాన్.

వైరం ఒక్కటే కాదు.. సినిమాలపైనా వీరికి కమిట్మెంట్ ఎక్కువే. అందుకే హెల్దీ వైరాన్ని కంటిన్యూ చేస్తున్నారు వీరిద్దరూ. ఏమైనా సరే.. సల్మాన్ స్వయంగా ఇంటికొచ్చేయడంతో... ఈ ఏడాది పుట్టినరోజు షారూక్ కి స్పెషల్ బర్త్ డేగా మిగిలిపోనుందనడంలో సందేహం అక్కర్లేదు.

,  ,  ,