Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2015 12:37:02
facebook Twitter Googleplus
Photo

సలోని అనగానే 'మర్యాద రామన్న'లో తెలుగమ్మాయిగా ఆమె చేసిన సందడి గుర్తుకు వస్తుంది. అయితే, ఆ తరువాత చేసిన సినిమాలు ఆమె కెరియర్ కి మరింత ఊపును ఇవ్వలేక పోయాయి. దాంతో ఇక్కడ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఐటమ్ సాంగు చేస్తూ ప్రత్యక్షమైంది. కళానిలయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడుతోన్న ఓ సినిమాలో ఆమె ఐటమ్ సాంగులో మెరవనుంది. లక్ష్మణ్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సలోని సాంగ్ ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

,  ,  ,  ,