Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2017 12:05:15
facebook Twitter Googleplus
Photo

సమంత - నాగ చైతన్య పెళ్లి ఎలా జరుగుతుందా అని అందరు ఎదురుచూశారు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసినప్పటి నుండి ఎన్నో వేడుకలతో అక్కినేని వారు సంతోషపడితే అది చుసిన అభిమానులు మరింత ఆనందపడ్డారు. ఇప్పుడు ఆలోచిస్తే పెళ్లి వేడుకలు తొందరగా గడిచిపోయాయే అనిపిస్తుంటుంది.

అన్ని స్పీడ్ గా అలా గడిచిపోయాయని సమంత కూడా ఇదే విషయాన్నీ తరచు ప్రస్తావిస్తూ ఉంటుంది. అయితే వీరి పెళ్లి గోవాలో జరిగిన తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ చైతు అంతగా ఇష్టపడడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. ఇక తల్లి తరపున చైతు దగ్గుబాటి వారి ఇంట్లో దగ్గరి బంధువులతో చెన్నయ్ లో చిన్నగా పార్టీ చేసుకున్నారు. కానీ నాగ్ ముందుగా అనుకున్నట్టుగానే రిసెప్షన్ కి ఇదే సరైన సమయం అని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

హైటెక్ సిటీలో ఉన్న వారి సొంత ఎన్.కన్వెన్షన్ లోనే నవంబర్ 12న నిర్వహించాలని నాగ్ డిసైడ్ అయ్యారట. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం నటీనటులను నాగ్ ఇన్వైట్ చేయనున్నాడట. ఇక రాజకీయ నాయకులకు స్పెషల్ గా ఇన్విటేషన్స్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,