Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 10:21:38
facebook Twitter Googleplus
Photo

చెన్నై సుందరి సమంతా రూత్ ప్రభు.. టాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాకుండా.. అక్కినేని వారి ఇంటి కోడలు అయిపోనుందనే సంగతి ఇప్పటికే అర్ధమైపోయింది. కొత్త సినిమాలకు సైన్ చెయ్యకపోవడం చూస్తుంటే.. ఇక సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసినట్లే అని కూడా టాక్ ఉంది. ఇప్పటికే నాగ చైతన్య-సమంతల పెళ్లి ఖాయం కాగా.. ఇప్పుడు ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటున్నారట.

ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. వచ్చే ఏడాది ప్రారంభంలోనే చై-శామ్స్ ల పెళ్లి వేడుక జరగనుందని టాక్. గత కొన్నాళ్లుగా సమంత పూర్తిగా చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. పెళ్లి పనుల్లో భాగంగానే అప్పుడప్పుడూ హైద్రాబాద్ వస్తోందిట. అయితే.. సమంత పెళ్లి చెన్నైలోనే జరగనుందని అంటున్నారు. అది కూడా ఆమె ఇంటి ఆచారాల ప్రకారం.. క్రైస్తవ సాంప్రదాయంలోనే వివాహ వేడుక జరగనుందట. అది పూర్తయ్యాక.. హైద్రాబాద్ లో తిరిగి హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారట చైతు-సమంత.

ఇప్పటికే ఆశిన్ ఇలానే పెళ్లి చేసుకుంది. మల్టీ మిలియనీర్ రాహుల్ శర్మతో ఆశిన్ వివాహం రెండు పద్ధతుల్లోనూ జరిగింది. ఇప్పుడు శామ్స్ కూడా ఇదే రూట్ ఫాలో అయిపోనుందని టాక్ వినిపిస్తోంది. ఏ పద్ధతిలో జరిగినా.. రెండు సాంప్రదాయాల్లోనూ జరిగినా.. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో అయితే.. సమంత-చైతుల పెళ్లి జరిగిపోవడం మాత్రం ఖాయమే.

,  ,  ,  ,  ,