Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 10:23:56
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున గతేడాది మాంచి జోరు చూపించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన అంటూ భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ్.. ఆ తర్వాత ఊపిరి మూవీతో మంచి సక్సెస్ నే కాదు.. బోలెడంత పేరు కూడా సంపాదించుకున్నారు. ఆ తర్వాత నాగార్జున ఫోకస్ అంతా తన కుమారుల కెరీర్ లను గాడిలో పెట్టడంపై పెట్టేశారు.

చైతు రీసెంట్ మూవీ రా రండోయ్ వేడుక చూద్దాం భారీ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ విషయంలో నాగార్జున చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కలిసి స్క్రిప్ట్ మార్పులు కూడా చేశారట. కొన్ని సీన్స్ ను రీషూట్ చేసేలా ఒత్తిడి చేశారట కూడా. అలాగే ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా రోజులు కూర్చున్నట్లు నాగార్జున స్వయంగానే చెప్పారు. ఆ సినిమా సక్సెస్ సాధించగానే.. ఇప్పుడు మరో కొడుకు అఖిల్ కెరీర్ పై ఫోకస్ పెట్టేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై కూడా ఆయన ఫోకస్ ఎక్కువగానే ఉండనుంది.

అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. నాగార్జున తర్వాత సినిమా ఏంటనే విషయం అర్ధం కావడంలేదు. రాజు గారి గది2 పూర్తి చేసేసిన నాగార్జున కోసం.. బంగార్రాజు సబ్జెక్టును సోగ్గాడే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రెడీ చేస్తున్నాడు. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా నాగ్ పేరుపై వినిపిస్తున్నాయ్ కానీ.. వీటిలో దేన్ని మొదలుపెడతారనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే కంటిన్యూ అవుతోంది.

,  ,  ,  ,  ,