Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2015 17:21:41
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతికి శరవేగంగా సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఓ పాత్ర నటించబోతున్నాడంటూ.. కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. పవన్ ను చరణ్ కలవడానికి వెళ్లినపుడు.. సాయిధరం తేజ్ అక్కడే ఉండండం పవర్ స్టార్ తో పాటు పోలీస్ డ్రెస్ లో కనిపించడంతో ఈ వార్తలు షికార్లు చేశాయి.

అయితే సర్దార్ లో ఇలాంటి గెస్ట్ కేరక్టర్ కి స్పెషల్ అప్పియరెన్స్ కి ఛాన్స్ లేదని తెలుస్తోంది. సర్దార్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలోనే.. తేజు నటిస్తున్న సుప్రీం కూడా షూటింగ్ జరుపుకుటోంది. చరణ్ వస్తున్నాడని తెలియడంతో.. సాయిధరం తేజ్ కూడా అక్కడికి వచ్చాడు. షూటింగ్ లో ఉన్న గెటప్ తోనే వచ్చేశాడు.

సుప్రీంలో తేజు క్యాబ్ డ్రైవర్ గా నటిస్తుండగా.. హీరోయిన్ రాశి ఖన్నా పోలీస్ పాత్రలో నటిస్తోంది. ఓ సన్నివేశంలో తేజుకూడా పోలీస్ గెటప్ వేయాల్సి వస్తుంది. ఆ సీన్ షూటింగ్ సమయంలోనే చరణ్-తేజులు పవన్ ను కలిసేందుకు రావడం ఫోటోలకు ఫోజులివ్వడంతో.. ఈ రూమర్స్ మొదలయ్యాయి. మొత్తానికైతే సర్దార్ గబ్బర్ సింగ్ లో కనపించే మెగా హీరో పవన్ ఒక్కడే. రాస్కో సాంబా.

,  ,  ,