Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2016 15:50:20
facebook Twitter Googleplus
Photo


సూపర్ స్టార్ మహేష్ నటించిన ?బ్రహ్మోత్సవం? సినిమా భారీ అంచనాల మధ్యన మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇక మహేష్‍తో కలిసి మూడో సినిమాకు పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చిందని, మహేష్ నటన పరంగా చాలా మెళకువలు నేర్పిస్తుంటారని తెలుపుతూ సమంత ?బ్రహ్మోత్సవం? గురించి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ వస్తున్నారు.
?మహేష్‌తో కలిసి ఇప్పటికే ?దూకుడు?, ?సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు? లాంటి రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించాను. కథే ప్రధానంగా నడిచే ?బ్రహ్మోత్సవం? మా ఇద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సూపర్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది? అంటూ బ్రహ్మోత్సవంపై సమంత ధీమా వ్యక్తం చేశారు. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రేపటి ఉదయం ఆటతో ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది.

,  ,  ,  ,  ,