Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 11:51:37
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్యకు కార్లంటే మహా ఇష్టం. ఈ టేస్ట్ చాలామంది సెలబ్రిటీల్లోనే కనిపిస్తుంది. లేటెస్ట్ మోడల్ లగ్జరీ కార్ల విషయానికి వస్తే.. చైతు కూడా కార్ లవర్స్ జాబితాలోనే ఉంటాడు. ఇప్పటికే చెయ్ గ్యారేజ్ లో పలు ఖరీదైన కార్స్ ఉండగా.. ఇప్పుడు మరో లేటెస్ట్ మోడల్ కూడా చేరింది.

బీఎండబ్ల్యూ కొత్త కారు కొనేశాడు నాగచైతన్య. బీఎండబ్ల్యూ7 సిరీస్ లో లేటెస్ట్ మోడల్ ను అందుకున్నాడు. టీఎస్ 09ఏక్స్ టీఆర్ 1290(టెంపరరీ రిజిస్ట్రేషన్) నెంబర్ గల కారును డెలివరీ అందుకున్న చైతు.. ఇప్పటికే తన లేటెస్ట్ మోడల్ కార్ తో చక్కర్లు కూడా కొట్టేస్తున్నాడు. ఈ లగ్జరీ మోడల్ ఖరీదు దాదాపు కోటిన్నరకు పైగానే ఉంటుంది. కార్ లవర్ కాబట్టి.. లేటెస్ట్ మోడల్ ను కొనేసి ఉండొచ్చు కానీ.. టైమింగ్ మాత్రం వేరే ఆలోచనలు రప్పించడం ఖాయం. చెయ్ బర్త్ డేకి చాలా టైం ఉంది. నాగార్జున పుట్టినరోజుకు కూడా ఇంకా టైం ఉంది.

కానీ చైతు కాబోయే భార్య సమంత రీసెంట్ గానే(ఏప్రిల్ 28)నే తన బర్త్ డేను జరుపుకుంది. ఆ రోజున చైతుతో అంతో అమూల్యమైన సమయాన్ని కూడా గడిపింది. అదే రోజున ఈ కారును బుక్ చేసి ఉంటారని.. ఇప్పుడా కార్ డెలివరీ అయి ఉంటుందని సినిమా వర్గాలు అంటున్నాయి.

,  ,  ,  ,  ,