Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 10:56:55
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు.. 150కు తీసుకున్నట్లు సంవత్సరాల సంవత్సరాల గ్యాప్ మాత్రం తీసుకోవట్లేదులే. ఈ సినిమాను కాస్త త్వరగానే మొదలెట్టి త్వరగానే పూర్తి చేస్తారట. అందుకే ఆగస్టు నెల నుండి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేయాలని ప్రొడ్యూసర్ రామ్ చరణ్.. డైరక్టర్ సురేందర్ రెడ్డి.. తగిన ఏర్పాట్లను చేస్తున్నారు.

ఇవన్నీ అటుంచితే.. అసలు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలి అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజ జీవితంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఇద్దరు భార్యలు ఉండటంతో..మనోళ్ళు వాస్తవానికి క్లోజ్ గా ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లను పెట్టేస్తున్నారట. అయితే పెద్ద భార్య సిద్దమ్మ పాత్ర కోసం అప్పట్లో అనుష్క అయితే బాగుంటుందని అనుకున్నారు కాని.. ఇప్పుడు మాత్రం ఎవరైనా బాలీవుడ్ బ్యూటిని దించితే సినిమా రేంజ్ పెరిగే ఛాన్సుంటుందని ఆశిస్తున్నారట. అందుకే ఈ కథతో ఐశ్వర్యరాయ్ ను ఎప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే మాత్రం.. తెలుగులో డైరక్టుగా హీరోయిన్ రోల్ ఐష్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. అంతుకు మునుపు టాలీవుడ్ లో నాగార్జున సరసన లవ్ టు లివ్ అంటూ రావోయి చందమామ సినిమాలో ఐష్ ఒక ఐటెం సాంగ చేసింది అంతే.

,  ,  ,  ,  ,