Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 15:06:42
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది వేసవి సీజన్లో ఎవ్వరూ ఊహించని విధంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందులో మూడు హిట్స్ సొంతం చేసుకున్న స్టార్ సమంత. ప్రస్తుతం సౌత్ ఇండియాలో విజయాల పరంగా చూస్తే టాప్ హీరోయిన్‌గా చెప్పుకోదగ్గ స్థాయి తెచ్చుకున్న ఈ హీరోయిన్, వేసవిలో చివరగా విడుదలైన తన ?అ..ఆ..? సినిమా తర్వాత గతంలో ఒప్పుకున్న ?జనతా గ్యారెజ్? మినహా ఏ సినిమా చేయడం లేదు. ఇక ఇప్పుడు జనతా గ్యారెజ్ కూడా దాదాపుగా పూర్తవ్వడంతో సమంత, సరదాగా కుటుంబ సభ్యులతో సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.
నిన్న మొన్నటివరకూ బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని షాపింగ్ చేస్తూ బిజీగా కనిపించిన సమంత, ఇప్పుడు తల్లిదండ్రులతో సెలవులను గడుపుతున్నారు. ఎక్కువగా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలేవీ పోస్ట్ చేయని ఆమె, తాజాగా అమ్మా, నాన్నలతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక సమంత నటించే సినిమాల విషయానికి వస్తే, ఈమధ్యే ?వాడ చెన్నై? అనే ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆమె, త్వరలోనే తన కొత్త ప్రాజెక్టు ఏంటన్నది తెలియజేస్తానన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,