Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 17:16:53
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది చెన్నై సోయగం సమంత. విజయ్-శామ్స్ జంటగా నటించిన తెరి.. మన దగ్గర డబ్బింగ్ వెర్షన్ పోలీసోడుగా రేపు విడుదల కానుంది. అయితే.. తమిళ్ తెరి మాత్రం ఇవాళే థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ మూవీ హిట్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది సమంత.

తెలుగులో ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించినా.. తన మాతృభాష అయిన తమిళ్ మాత్రం.. సక్సెస్ లేక ఇబ్బందులు పడుతూనే ఉంది. సక్సెస్ ల మాట పక్కన పెడితే.. అమ్మడు నటించిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో గ్రేట్ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. సూర్యతో అంజాన్.. విక్రమ్ తో 10 ఎన్రాదుకుళ్ల - ధనుష్ తో తంగమగన్ సినిమాలు.. అట్టర్ ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా వస్తున్న విజయ్ మూవీ తెరిపైనే ఆశలు పెట్టుకుంది సమంత. కోలీవుడ్ వరకూ చూసుకుంటే.. తన కెరీర్ తెరికి ముందు తెరికి తర్వాత అనే రేంజ్ లో ఉంటుందన్నది అమ్మడి ఆశ.

దీనికి తగ్గట్లుగానే తెరి చిత్రం కోసం అభిమానులు థియేటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. ఏకంగా పోలీసులతో ప్రొటెక్షన్ ఇచ్చి.. టికెట్స్ ఇష్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పులి ఫ్లాప్ తర్వాత వస్తున్న విజయ్ మూవీ కావడంతో.. అభిమానులు తెరి చిత్ర సక్సెస్ కోసం.. బాగానే ట్రై చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,