Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:36:24
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బ్యూటీ సమంత గతేడాది కాసింత బ్రేక్ తీసుకుంది కానీ.. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా సినిమాలు చేసేస్తోంది. ఇప్పటికే మూడు సినిమాల షూటింగులు చేసేస్తున్న సామ్.. ఇప్పుడు నాలుగో మూవీ షూటింగ్ ను కూడా మొదలుపెట్టేస్తోంది. తమిళ్ మూవీ అనీథి కథైగళ్.. తెలుగులో రాజుగారి గది2.. రామ్ చరణ్-సుకుమార్ ల సినిమాల్లో ప్రస్తుతం సమంత నటిస్తోంది.

తమిళ స్టార్ విజయ్ 61వ సినిమాలో కూడా సమంత ఒక హీరోయిన్ గా అంగీకరించింది. ఇప్పటికే విజయ్61 షూటింగ్ ప్రారంభమైపోగా.. గత నెలలో విజయ్ - కాజల్ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ తెరకెక్కించారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుండగా.. ఈ షెడ్యూల్ లో సమంత కూడా పాల్గొననుంది. దాదాపు మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ సాగనుండగా.. మొత్తం షెడ్యూల్ అంతా సమంత షూటింగ్ లో పాల్గొంటుందిట.

ఈ మూవీలో నిత్యా మీనన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇలయ దళపతి విజయ్ ఈ చిత్రంలో మూడు కేరక్టర్లలో కనిపించనున్నాడనే టాక్ ఉంది.

,  ,  ,  ,  ,  ,