Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2016 19:04:54
facebook Twitter Googleplus
Photo

సమంత బోళా మనిషాయె.. మనసులో ఏమీ దాచుకోదు. ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంది. తన పర్సనల్ విషయాలైనా అస్సలు దాచుకోకుండా మాట్లాడేయడం అలవాటు. తాను పెళ్లిచేసుకోబోయే వాడి గురించి మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో ఇలాగే ఓపెన్ గా చాలా మాట్లాడేసింది. పేరైతే చెప్పలేదు కానీ.. ఇవ్వాల్సిన హింట్లన్నీ ఇచ్చేసింది. అతనో సినీ ఫ్యామిలీకి చెందిన వాడని.. కాస్త మూడీగా ఉండే టైపని.. తామిద్దరం కలిసి నటించామని.. ఇలా జనాలు ఈజీగా ఆ హీరో ఎవరో గుర్తుపట్టేసే హింట్లు ఇచ్చింది సామ్. దీంతో జనాలు సమంత నటించిన హీరోల పేర్ల లిస్టు తీసి.. అందులో పెళ్లికాని హీరోల్ని షార్ట్ లిస్ట్ చేసి ఆమె వలచిన వాడెవరో ఓ అంచనాకు వచ్చేశారు.

ఇంకేముంది.. ఆ హీరో పేరు ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. కొందరైతే నేరుగా ఆ హీరోకు ఫోన్లు చేసి ఈ సంగతి నిజమేనా అని వాయించేస్తున్నారట. సమంత చెబుతున్నట్లు నిజానికి ఆ హీరో ఫ్యామిలీ నుంచి వీరి పెళ్లికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఏమీ రాలేదట. ఈ నేపథ్యంలో ఆ హీరో సమంత వ్యాఖ్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నట్లు సమాచారం. ఈ విషయమై సమంత దగ్గర ఆ హీరో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సమంత.. ఇకపై నా పెళ్లి గురించి నో కామెంట్స్ అంటూ ట్వీట్ పెట్టి సైలెంట్ అయిపోయింది. మరి వీళ్లిద్దరి బంధం గురించి అధికారిక సమాచారం ఎఫ్ఫుడొస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,