Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:59:12
facebook Twitter Googleplus
Photo

సౌత్ లో హీరోయిన్స్ కి సినిమాల్లో పెద్ద స్కోప్ ఉండదు. హీరోయిన్స్ కి ప్రాధాన్యత లేదు కాబట్టే మూవీస్ ఒప్పుకోవట్లేదు.. ఇక మీద కూడా అంతే.. ఖాళీగా అయినా ఉంటా కానీ నా రోల్ కి ప్రాధాన్యం లేకపోతే సినిమాలు చేసే ప్రసక్తే లేదంటూ పింక్ మూవీ చూసిన తర్వాత ఆవేశంలో పేద్ద పేద్ద స్టేట్ మెంట్స్ పోస్ట్ చేసింది సమంతా. అన్నట్టే చాలా రోజులు అలాగే ఉండిపోయి ఈ మధ్యే మళ్లీ రెండు తమిళ సినిమాలకి సైన్ చేసింది. అయితే సమంతా సైన్ చేసిన మూవీస్ చూస్తే చెప్పిన మాటలకి చేస్తోన్న పనులకి ఎక్కడో లింక్ మిస్ అవుతున్నట్టుంది.

శివకార్తీకేయన్.. విశాల్ తో సినిమాలు చేస్తోంది సమంతా. శివ- కార్తీకేయన్ మూవీస్ అంటే ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ మెంట్సే డౌటే లేదు. కానీ అందులో హీరోయిన్స్ కన్నా శివకి.. తనతో పాటు యాక్ట్ చేసే కమెడియన్స్ కే ఎక్కువ రోల్ ఉంటుంది. సినిమా మొత్తం తన భుజాల మీద మోసేయడం శివకి అలవాటు. మరి అలాంటి శివ మూవీలో సమంతా ఎంత ప్రాధాన్యత ఉన్న రోల్ చేస్తోందో అన్నదే ఇప్పుడు పెద్ద డౌట్. ఇక విశాల్ సంగతి చెప్పక్కర్లేదు. మాస్ మంత్రం జపించే ఈ హీరోగారి సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాటేసుకోడానికి వచ్చి వెళ్లిపోయే టైంపాస్ కేరెక్టర్లు మాత్రమే. విశాల్ మూవీస్ ఫాలో అయ్యే వారందరికి ఈ విషయం బాగా తెలుసు. అలాంటి విశాల్ తోనూ జోడీ కడుతోంది అంటే చూస్కోండి మరి.

అందుకే అందరూ సమంతా స్టేట్ మెంట్స్ ని తనకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటీ సమంతా ఇది.. నువ్వు కూడా అలా చేస్తే ఎలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి సమంతా ఏం చెబుతుందో చూడాలి. కామెడీ.. మాస్ మూవీస్ చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నా అంటుందో... లేకపోతే మీరు మారరా అని రివర్స్ లో క్లాస్ పీకుతుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,