Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 12:20:13
facebook Twitter Googleplus
Photo

తన నటనతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గా పేరు తెచ్చుకున్న ?శర్వానంద్? ప్రస్తుతం కొత్త దర్శకుడు ?చంద్రమోహన్? దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ లో మెప్పించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో శర్వా కు విలన్ గా భోజ్ పూరి సూపర్ స్టార్ ?రవి కిషన్? నటిస్తున్నాడు.
తన వైవిధ్యభరితమైన నటనతో సినిమా వెయిట్ పెంచే ఈ నటుడు గతంలో రేసు గుర్రం, కిక్ ? 2, సుప్రీం వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కు విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ జనాల్లో ఆసక్తి రేగుతోంది. ఇకపోతే ?బివిఎస్ఎన్? ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ?లావణ్య త్రిపాఠి? హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,  ,