Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 11:03:26
facebook Twitter Googleplus
Photo

ఇంతకీ సమంత అసలు ఏ రోల్ ప్లే చేస్తోంది? ఇప్పుడు ''మహానటి'' సినిమా షూటింగ్ మొదలైన తరుణంలో.. అసలు ఈ సినిమాలో అమ్మడు ముందుగా చెప్పినట్లు జర్నలిస్టు రోల్ పోషిస్తోందా లేదా అనే సందేహం ఏర్పడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మడు సరికొత్త గెటప్ లో కనిపించేస్తోంది మరి.

సడన్ గా ఇంటర్నెట్లోకి వచ్చిన ఒక ఫోటోలో ఇప్పుడు సమంత చక్కగా చీరకట్టుకుని.. నెత్తికి అలంకరణ చేసుకుని.. ఒక చెలికత్తిలా కనిపిస్తోంది. మహానటి షూటింగ్ స్పాటులో తీసిన ఒక ఫోటో అంట. చూస్తుంటే అమ్మడు సావిత్రి పక్కనే నటిస్తున్న మరో నటీమణిలా కనిపిస్తోంది కదూ. కొంపతీసి అమ్మడు జమున రోల్ చేస్తోందా? లేదంటే సావిత్రి ప్రక్కన చాలా సినిమాల్లో నటించిన ఒక జూనియర్ ఆర్టిస్టులా కనిపించి.. ఆ తరువాత సావిత్రి కథను ఆమె జనాలకు నెరేట్ చేసినట్లు చూపిస్తారా? అసలు జర్నలిస్టు పాత్రను పోషిస్తుంటే మాత్రం సమంత ఈ గెటప్ లో ఎందుకు కనిపించింది? అననేదే అసలు ప్రశ్న.

ఇకపోతే సమంత ఓ రెండు రోజుల క్రితం వెకేషన్ పేరుతో ఎక్కడికో వెల్ళింది. నాగ చైతన్యతో కలసి థాయ్ ల్యాండ్ లో షికార్లు కొడుతుందని టాక్.

,  ,  ,  ,  ,