Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 11:13:03
facebook Twitter Googleplus
Photo

దగ్గరైన నెంబర్ కు రౌండ్ ఫిగర్ చేస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అది ఖలేజా సినిమాలో ఆయన పోషించిన క్యారక్టర్. అయితే ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఒక రౌండ్ ఫిగర్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అది కూడానూ మన తెలుగు ఇండస్ర్టీలో జరిగిన ఒక ఎపిసోడ్!! ఛలో.. అదేంట చూసొద్దాం.

నిజానికి ట్రైలర్ రిలీజ్ చేసేవరకు చిన్న హింట్ కూడా ఇవ్వకుండా సైలెంటుగా పని కానచ్చిన లవర్ బాయ్ నాగ శౌర్య.. 'ఛలో' పోస్టర్ అండ్ టీజర్ తో భలే ఆకట్టుకున్నాడు. అందుకే ఈసినిమాకు అమాంతం భారీ క్రేజ్ ఏర్పడింది. దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టివి ఛానల్స్ వారు కూడా అంతిస్తాం ఇంతిస్తాం అంటూ వెంట పడుతున్నారట. అయితే ఇప్పుడు జెమిని టివి వారు ఈ సినిమాకు గాను 2.50 కోట్ల రూపాయలు శాటిలైట్ కు ఆఫర్ చేస్తే.. అబ్బే కాదు 2.52 కావాలని అన్నారట ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన శంకర్ ప్రసాద్. ఆయనెవరో కాదు.. నాగ శౌర్య ఫాదరే.

కేవలం రెండు లక్షల్లో పెద్ద భేరమేంటి సార్ అనుకోకండే. ఆయనకు టోటల్ 9 సెంటిమెంట్ ఉంది. కాబట్టి.. 2.52 అంటే అది టోటల్ తొమ్మిది అవుతుంది. అందుకే ఆ సంఖ్యకు ఆయన రౌండప్ చేశారు.

,  ,  ,  ,  ,  ,