Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 10:34:13
facebook Twitter Googleplus
Photo

టాప్ హీరోయిన్ సమంత అటు షూటింగులకూ వాటికీ వెళ్తున్నా కూడా.. అమ్మడు ఎంతేసేపూ చేతిలో ఫోను అందులో ట్విట్టర్ యాప్ అన్నచందాన కాలం గడిపేసింది. ఎందుకంటే ఎంతసేపూ ట్విట్టర్లో ఏదో ఒక విధంగా రచ్చ చేయడమే పనిగా పెట్టుకుంది. అయితే ఆ రచ్చంతా కూడా నాగచైతన్య కొత్త సినిమా యుద్దం శరణం సినిమాను ప్రమోట్ చేయడానికే వాడిందిలే.

ఇక శుక్రవారం ఉదయాన్నే లేచి.. నాగచైతన్యకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. యుద్దం శరణం సినిమా హిట్టవ్వాలంటూ దేవుడుకి ప్రార్ధిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత అమ్మడు ఎవరైనా ఎక్కడైనా ట్విట్టర్ లో ఈ సినిమాను కాస్త పొగుడుతూ ఒక లైన్ పెడితే చాలు.. వెంటనే దానిని షేర్ చేసేసింది. అలా ట్విట్టర్ అంతా కూడా తన పతి ప్రేమతో ముంచెత్తింది. కట్ చేస్తే సాయంత్రం అయ్యేసరికి సినిమాకు చాలా నెగెటివ్ రివ్యూలు వచ్చేశాయి. దానితో సమంత కూడా ఇంతకంటే ఎక్కువ లాగితే కష్టం అనుకుందేమో కాని.. అక్కడితో సాగతీయడం ఆపేసింది. ఓ రకంగా చెప్పాలంటే సినిమా కోసం ఈమె చేసిన హడావుడంతా వేస్ట్ అయ్యిందనే చెప్పాలి.

మరో ప్రక్కన సమంత హడావుడి వేస్ట్ అవ్వగా.. సినిమాకు కూడా బ్యాడ్ టాక్ వచ్చేయడంతో.. ఇటు నాగార్జున్ అక్కినేని అవార్డు గురించి ప్రకటించి.. మొత్తంగా అందరినీ డైవర్ట్ చేసేశారని చెప్పుకుంటున్నారు నెటిజన్లు.

,  ,  ,  ,  ,