Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2017 10:12:53
facebook Twitter Googleplus
Photo

చలపతిరావు చేసిన కామెంట్లతో ఓ రెండురోజులపాటు ఫిలిం నగర్ అట్టుడికిపోయింది. కొందరు ఫర్ గా కామెంట్లు చేస్తూ కొందరు యాంటీగా కామెంట్లు చేస్తూ.. మొత్తానికి సదరు ఇన్సిడెంటును రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు భలే ప్రమోషన్ గా వాడేశారు. అదంతే సరేకాని.. ఇప్పుడు అనవసరంగా సమంత ట్రబుల్స్ లో పడేలా ఉంది. అబ్బే ఈ చలపతిరావు మ్యాటర్లో మాట్లాడనందుకు కాదులే.

మొన్న సాయంత్రం జె.ఎఫ్.డబ్లూ మ్యాగజైన్ ఫోటో షూట్ చేస్తూ.. అక్కడే దిగిన ఒక ఫోటోను పోస్టు చేసింది సమంత. ఆ దెబ్బతో ఒక్కసారిగా ట్విట్టర్ అంతా హోరెత్తిపోయింది. హ్యాండ్ లూమ్స్ లో తయారుచేసిన బికినీ టాపులో.. స్కర్టులో.. అమ్మడు తన అందాలను అబ్బురపరిచే రీతిలో ఆరబోసింది. ఇకపోతే ఎంగేజ్మెంట్ అయిపోయాక కూడా అమ్మడు ఈ రేంజులో హాటుగా కనిపించడం ఒకెత్తయితే.. అసలు ఖాదీలో ఇలా కనిపిస్తావా అంటూ కొందరు రచ్చ చేస్తున్నారు.

అసలు ఖాదీ వస్ర్తాలు అంటే పవిత్రతకు మారుపేరు.. వాటికి వెస్ర్టన్ హంగులు అద్దేసి.. ఇలా బికినీ తరహాలో చూపించడం ఏంటి అంటూ ఈ ఖాదీ ప్రేమికులు కొందరు మండిపడుతున్నారు. పైగా హ్యాండులూమ్స్ ఆఫ్ తెలంగాణ అంటూ బికినీలో అందాలను ఆరబోసి మా పరువు తీసింది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఎప్పుడో టైమ్ దొరికినప్పుడు చూసి వీరు సమంతను ఫుట్ బాల్ ఆడేసేలా ఉన్నారే!!

కాని సమంత మాత్రం.. ఏదో తనకు అప్పజెప్పిన బాధ్యత చక్కగా నిర్వర్తించుకుంటూ పోవడమే ధ్యేయం అన్నట్లు హ్యాపీగా తన షూట్లు తాను చేసుకుంటూ పోతోంది.

,  ,  ,  ,