Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2017 12:35:38
facebook Twitter Googleplus
Photo

ఎంతగానో ప్రేమించిన నాగచైతన్యను పెళ్లి చేసుకుని ఆనందంగా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది హీరోయిన్ సమంత. కాకతాళీయమే అయినా చై - సమంతల పెళ్లినాటికి మామగారయిన నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది-2 సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో తొలిసారి సమంత ఆత్మ పాత్రలో కనిపించింది.

ప్రస్తుతం సమంత తెలుగు - తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఉంది. ప్రతి సినిమాకు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కోట్లలోనే ఉంది. రాజుగారి గది-2 సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంతని ఆరా తీస్తే.. ఆమె మామూలుగా తీసుకునే మొత్తానికి సగం మాత్రమే తీసుకుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించింది నాగార్జున కావడంతో రెమ్యునరేషన్ విషయం పట్టించుకోకుండా సినిమాకు స్టార్ లుక్ తీసుకురావడం కోసం పని చేసిందట. ఆమె రోల్ కు సంబంధించిన అమౌంట్ కూడా సినిమా రిలీజై హిట్ టాక్ వచ్చాకే ఆమె చేతులకు వచ్చిందని తెలుస్తోంది.

రాజుగారి గది-2 ఓవర్సీస్ లో పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ మన దగ్గర మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. తొలిసారి హర్రర్ కామెడీల్లో స్టార్లు నటించడం ఈ సినిమాకు బజ్ తీుకొచ్చింది.

,  ,  ,  ,  ,  ,