Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2017 13:02:23
facebook Twitter Googleplus
Photo

మహానటి సావిత్రి జీవితంపై సినిమా.. ఈ విషయం పాతదే. మహానటి టైటిల్ పై రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్.. సమంతలు నటిస్తున్నారన్న విషయమూ పాత సంగతే. టైటిల్ రోల్ లో కీర్తి సురేష్ కనిపించనుందన్న మాట వాస్తవమే. కానీ ఇంతకూ ఈ సినిమాలో సమంత పోషిస్తున్న రోల్ ఏంటి? ఇదే తెగ కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది.

లీడ్ రోల్ లోకి ఇప్పుడే స్టార్ డం దగ్గరకు వస్తున్న యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ను తీసుకుని.. మరో రోల్ కు స్టార్ హీరోయిన్ సమంతను ఒప్పించారంటే.. ఖచ్చితంగా అది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర అవాల్సిందే. లేకపోతే సమంత ఒప్పుకోదు కదా. మొదట సావిత్రి కథను నేరేట్ చేసే జర్నలిస్ట్ పాత్ర అనే టాక్ వచ్చింది. కానీ అలనాటి మరో మేటి నటి జమునగా సమంత నటిస్తోందంటూ పుకార్లు బయల్దేరాయి. ఇప్పుడు మళ్లీ సమంత పోషిస్తున్న పాత్ర విలేఖరి రోల్ మాత్రమే అంటున్నారు. అది కూడా ఇప్పటి జర్నలిస్ట్ కాదట. 1980ల కాలంనాటి జర్నలిస్ట్ పాత్ర అంటున్నారు.

సావిత్రి జీవిత చరిత్ర అంటేనే పీరియాడిక్ కాన్సెప్ట్. దాన్ని వివరించే జర్నలిస్ట్ రోల్ కూడా 80ల కాలానికి చెందినదే అంటే.. మరో పీరియాడిక్ అవుతుంది

,  ,  ,  ,  ,  ,