Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2016 15:09:21
facebook Twitter Googleplus
Photo

యువ దర్శకుడు మారుతి గురించి చెప్పాల్సి వస్తే ?భలే భలే మగాడివోయ్?కి ముందు-తర్వాత అని మాట్లాడుకోవాలి. అంతకుముందు కూడా అతడి కెరీర్లో మాంచి సక్స్స్ లే ఉన్నాయి కానీ.. గొప్ప పేరైతే లేదు. అతణ్ని సెకండ్ గ్రేడ్ డైరెక్టర్ గానే పరిగణించేవాళ్లు అప్పటివరకు. కాస్త ఇమేజ్ ఉన్న హీరోలెవరూ అంతకుముందు అతడితో పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఐతే బీబీఎం బ్లాక్ బస్టర్ హిట్టవగానే.. ఇంతకుముందు మారుతితో ఓ సినిమా మొదలుపెట్టి ఆపేసిన విక్టరీ వెంకటేష్ సైతం అతడితో పనిచేయడానికి ముందుకొచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ?బాబు బంగారం? త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ లోపే తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసేసుకున్నాడు మారుతి.

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో మారుతి తన తర్వాతి సినిమాను రూపొందించబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయింది. దీని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడమే తరువాయి. ఐతే ఈ కాంబినేషన్ మాటెత్తగానే అందరికీ పవన్ కళ్యాణే గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే మారుతి పవన్ కు వీరాభిమాని. పవన్ తో సినిమా చేయడమే తన జీవితాశయం అని చాలాసార్లు చెప్పాడు. ఇక సాయిధరమ్ తన ప్రతి సినిమాలోనూ మావయ్యను ఫుల్లుగా వాడేసుకుంటున్నాడు.

ఇంతకుముందు పవన్ అభిమాని అయిన హరీష్ శంకర్ తో సాయిధరమ్ సినిమా చేసినపుడు.. ఇద్దరూ ఏ స్థాయిలో పవన్ పేరును వాడుకున్నారో తెలిసిన సంగతే. ఇక ఇప్పుడు మరో పవన్ వీరాభిమానితో అతను సినిమా చేయబోతున్నాడు. మరి వీళ్లిద్దరూ కలిసి ఏ స్థాయిలో పవన్ స్తోత్రాలు వినిపిస్తారో చూడాలి. ఇప్పటికే సాయిధరమ్ సినిమాల్లో మెగాస్టార్-పవర్ స్టార్ ల వాడకం మరీ ఎక్కువైపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. అభిమానులకు కూడా కొంత మొనాటనీ వచ్చేస్తోంది. కాబట్టి మారుతి-సాయిధరమ్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో పవన్ వాడకం మరీ ఎక్కువ లేకుండా చూసుకుంటే బెటర్.

,  ,  ,  ,  ,  ,