Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2017 11:25:25
facebook Twitter Googleplus
Photo

నాకు పిల్లలకు హెల్ప్ చేయడంలోనే చాలా హ్యాపినెస్ ఉంటుంది. అందుకే నేను ప్రత్యూష్ ఫౌండేషన్ తరుపున ఒక అనాథాశ్రమాన్ని ఎడాప్ట్ చేసుకుని.. అందులోని పిల్లలందరినీ సినిమాకు తీసుకొచ్చాను అంటోంది సమంత. గత రాత్రి హైదరాబాదులో జరిగిన బాహుబలి 2 సినిమా ప్రీమియర్ కు సమంత ఈ పని చేసింది. కనీసం కొంతమందికైనా జీవితాల్లో మార్పు తేవాలని ఈ పనులు చేస్తున్నాను.. అంటోంది ఈ హాటీ.

అయితే ఇలా పిల్లలను ఎందుకు సినిమాకు తీసుకు వచ్చిందో చెబుతూ.. నేను ఎందుకు ఇంత పెద్ద స్టార్ అయ్యానో నాకు తెలియదు. నాకంటే అందం.. టాలెంట్.. ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు కాని.. నేను టాప్ పొజిషన్లో ఉన్నాను. అంటే నాకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అందుకే నేను నా గిఫ్ట్ ను వేరేవాళ్లతో పంచుకోవాలని అనుకుంటూ ఉంటాను. అందుకే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఇలా ఎవరోఒకరికి ఏదో ఒక సాయం చేయాలని అనుకుంటుంటాను అని చెప్పింది సమంత.

ఇకపోతే బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ.. ఇదొక సినిమా కాదండీ. ఒక సెలబ్రేషన్. ఒక దీపావళి ఒక న్యూ ఇయర్ తరహాలో ఈ సినిమా కూడా ఒక పండగలా మారిపోయింది.

,  ,  ,  ,  ,